ఆ కిక్కే వేరప్పా!
ఈసారి మన క్రౌంచద్వీప డాషింగ్ రచైతల సంఘం సంవత్సరీకాలు అంటార్కిటికాలో! సంవత్సరీకాలేమిటండీ అశుభం మాటలు? అదేనయ్యా, ప్రతి సంవత్సరం మనం జరిపే రచైతల సమావేశాలు! అంటార్కిటికా లోనా?? అంత దూరం ఎవరొస్తారండీ? వస్తారు. అంతా వస్తారు. వీళ్ళందరికీ ప్రయాణ ఖర్చులు మనకి తడిసి మోపెడు అవుతాయండీ బాబూ! దారి ఖర్చులు వాళ్ళే పెట్టుకుని వస్తారు. వారికక్కడ బస? ఎవరి బస వాళ్ళే చూసుకుంటారు. మరి వీళ్ళందరికీ అక్కడ భోజనాల ఏర్పాట్లు? ఎవరి భోజనం సంగతి వాళ్ళే చూసుకుంటారు. బాగోదేమోనండీ? సరే, మరి వీళ్ళందరికీ శాలువాలూ అవీ? ఎవరి శాలువా వాళ్ళే తెచ్చుకుంటారు. అలాగా? ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. మీ అయోమయాలు గూట్లో పెట్టి ఆహ్వాన పత్రికలు పంపండి. డేరింగ్ కథలు/క్రేజీ కవితలు వ్రాసిన ప్రముఖ రచయిత/కవి అయిన మిమ్మల్ని వచ్చే నెల 15 న అంటార్కిటికాలో జరగబోతోన్న మా రచైతల సమావేశానికి క్రౌంచద్వీప డాషింగ్ రచైతల సంఘం సగౌరవంగా ఆహ్వానిస్తోంది. ఈ ఆహ్వానితుల్లో కొంతమంది ఇంత వరకూ ఒకటే కథ, ఒకటే కవిత రాసిన వాళ్ళున్నారు కదండీ? వ్రాసిన ఒక్క కథ/కవిత తోనే ప్రఖ్యాతి గాంచిన - అని మార్చి పంపం...