తెలుగు వంటకు సాటి లేదు సుమతీ!
ఆవ పెట్టిన అరటిపువ్వు కూర తిను. ఒంటికి మంచిది. ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట ఎవడు తింటాడు? పోనీ, చింత చిగురు పప్పు తిను. ఒంటికి మంచిది. ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట నేనస్సలు ముట్టుకోను. సరేలే, అరటి దూట కూర తిను. ఒంటికి మంచిది. ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట ఎవడు తింటాడు? పోనీ, పనస పొట్టు కూర తిను. ఒంటికి మంచిది. ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట నేనస్సలు ముట్టుకోను. సరేలే, గుమ్మడికాయ దప్పళం తిను. ఒంటికి మంచిది. ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట ఎవడు తింటాడు? పోనీ, రోటి పచ్చడి తిను. ఒంటికి మంచిది. ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట నేనస్సలు ముట్టుకోను. సరేలే, మజ్జిగ పులుసు తిను. ఒంటికి మంచిది. ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట ఎవడు తింటాడు? సరే బాబు, అల్లం అంటే నాకు తెలీదా, బెల్లంలాగా పుల్లగా ఉంటుందన్నాడట వెనకటికెవడో. సరేకానీ, నీకు నచ్చినట్టు ఊరేగు. కొన్నేళ్ళయ్యాక- ఏంటి బాబు, పచ్చికూరల జ్యూసులు, నానబెట్టిన పప్పులు అవీ తింటున్నావ్ సన్యాసిలాగా? ఏం చెప్పమంటారు? నాకు బీపీ సుగరు కొలెస్ట్రాలు అన్నీ ఎగ్స్ట్రాగా ఉండడం వల్ల గుండె, లివరు, కిడ్నీలు అన...