యథా కాష్టంచ కాష్టంచ
ఔర! ప్రభాతశైల సానూపల నీలపాళికల నొత్తకయే స్రవియించు ఆ హిమానీ పరగాయనీ గళ వినిశ్రుత మాధురి మంటి కీడ్తురా? ఈడ్తురు. మంటికీడ్తురు. బురద కీడ్తురు. ప్రేమని చీకటి గదుల్లో లాగ జూతురు. పంజరములో బంధింపజూతురు. ఈర్ష్యా పిశాచిని నిద్దుర లేపుదురు. సుఖశాంతులను హరింపజేతురు. పక్షినని పాడగలనని ప్రణయ వీధి నిత్య లీలావిహారముల్ నెరపుదునని పక్షముల దూల్చి బంధించి పంజరాన గానమును బ్రాణమ్ము హరింప బూనినారు అని వగచి ఏమీ లాభం లేదు అమ్మీ. ప్రేయసి సోయగమ్మునకు లేదు శరీరము అని అనుకునే వారు బహు కొద్ది. శ్రీకృష్ణ ఉవాచ: పార్ధా! ప్రేమ.అభిమానం.ఆరాధన. అన్నీ స్వకపోలకల్పిత మనో వికారాలు అని నువ్వు తెలుసుకోగలిగితే చిత్త భ్రాంతులన్నీ వాటంతట అవే తొలగిపోయి మనస్సుకి స్వస్థత చేకూరగలదు. కన్ను మెచ్చిన వారిని ఆకాశానికెత్తడాలు. ఊహాభవంతులు కట్టడాలు. అఖండ ఆరాధనా దీపం వెలిగించడాలు. ఈ మనో దౌర్బల్యానికే,చిత్త చాంచల్యానికే రకరకాల పేర్లు పెట్టుకున్నారమ్మడూ,పనీపాటు లేని భావు...