పోస్ట్‌లు

అమ్మ ఊరెళితే

  అమ్మ ఊరెళితే వంట గిన్నె చప్పుడు చెయ్యదు  నిటారు గరిటె తాళం పట్టదు మిటారి కుక్కరు ఈల వెయ్యదు నెగడు నాలిక సాచదు కవ్వం నిలువు చాకిరీ చెయ్యదు  ఎసరు కాగదసలే దోశ కాలదు పట్కార నోరు తెరవదు పోపుల పెట్టె నిద్ర లేవదు ఆకలంటే ఏ పాదమూ పరిగెత్తుకు రాదు అమ్మ ఊరెళితే ఇల్లంత కొక్కురు భూతం గుడ్లెర్ర జేసి కోప్పడుతుంది ఆ వెనకే వచ్చే గుయ్యారం భయపెడుతుంది అమ్మ ఊరెళితే ఇంటి శోభంతా అమ్మ వెనకాలే  ఊరెళుతుంది.

Phone call

  పొద్దు పోక ఏ స్నేహితునికో ఫోన్‌ కలుపుతావు పనికిరానివి పని లేనివి మాటలు కొన్ని కొత్తవి ఏవో పాతవి శబ్దాధిష్ఠానాలతో ఆ శబ్దానురాగాన్ని  సశబ్దపానం చేసే ఓ కులాసాలో మైమరపులో రెండు మాటలు  దొర్లుతావు రహస్యాలు కొన్ని పర్వాలేదన్నట్టు విప్పుతావు ఒంటరితనాన్ని పోగొట్టుకుంటున్న చిరత్న ఘడియలలో ప్రతిసారీ నీకు తెలీకుండా నీమీదకు నువ్వే కొత్త ఉచ్చులు విసురుకుంటావు కొత్త పశ్చాత్తాపాలు కోరి తెచ్చుకుంటావు అదిగో, వద్దు వద్దన్నా ఏ స్నేహితునికో ఫోన్‌ కలుపుతావు.

మహా నాయకుడి బిడ్డలు

  ఏంటండీ, ఆ మహా నాయకుడికి శిలావిగ్రహం పెడదామని చందా అడిగితే ఆయన కొడుకులు, కూతుళ్ళు మేం ఇవ్వం అన్నారట? అంత గొప్ప ప్రజా సేవకుడి కడుపున చెడబుట్టారు! అయ్యో, మీకు తెలియదండీ, ఆయన ఇల్లు, పిల్లలు పట్టించుకోకుండా  ప్రజా సేవ అంటూ తిరిగేవాడండీ! అలాగా! సమాజం కోసం కుటుంబాన్ని  పక్కన పెట్టిన మహానుభావుడు! ఆయన పిల్లల ఫీజులు కట్టకుండా,  వాళ్ళ చదువులు పట్టకుండా   ప్రజా సేవ అంటూ ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడండీ! అలాగా! సమాజం కోసం తన వాళ్ళనే పక్కన పెట్టిన ధన్యజీవి! ఆయన ఉన్న ఆస్తులు పాస్తులు కూడా  పిల్లలకి దక్కకుండా సమాజానికి రాసిచ్చేసాడండీ! అలాగా! సమాజం కోసం తన ఆస్తినే త్యాగం చేసిన గొప్ప మనిషి! ఆయన సమాజం కోసం చివరికి తన ఇల్లు కూడా గ్రంథాలయానికి రాసిచ్చేసాడని, ఇప్పుడాయన భార్యకు ఉండడానికి ఇల్లు లేదని తెలిసిందండీ! ఆహాహా! ఇంత గొప్ప ప్రజా నాయకుడు నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు!   ఇంతకీ ఆ పిల్లలు మాత్రం తండ్రి గొప్పతనాన్ని గుర్తించలేని పచ్చి స్వార్ధపరులు! 

create,trim and modify!

  జీవితమంతా తింగిరిబింగిరిగా తయారైంది గురూజీ!  ఏం చెయ్యాలో తోచక జింగిరిగింగిరి అయిపోతున్నా! చాలా ఈజీ శిష్యా!  నీ లోకాన్ని నువ్వే సృష్టించుకో! అదెలా గురూజీ?  నీ లోకాన్ని నీకు నచ్చిన మనుషులతో నింపుకో.  నచ్చని మనుషుల్ని?    తీసెయ్‌! నాకు నచ్చిన మనుషులు వెళ్ళిపోతే?  ఆ గాప్‌ని వెంటనే ఇంకో నచ్చిన మనిషితో ఫిలప్‌ చెయ్యి! నాకు నచ్చిన వాళ్ళు కొన్నాళ్ళకి మారిపోతే? నీకు నచ్చినప్పుడు ఉన్న మనిషిని నీ లోకంలో పెట్టుకుని  ఈ మారిపోయిన మనిషిని నీ లోకంలోంచి తోసేసెయ్‌!  బాధాకరమైన జ్ఞాపకాలుంటాయ్‌ కదా గురూజీ?  వాటిని నీ లోకంలోంచి చెరిపెయ్‌! చెరిపేసి?  అందమైన జ్ఞాపకాలతో నింపేసెయ్‌! ప్రతి రోజూ నీ లోకాన్ని modify చేస్తూ trim చేస్తూ  నీ లోకాన్ని నీకు నచ్చిన వాటితో నింపుకుని ఆనందంగా గడిపేసెయ్‌!  అంతే శిష్యా, create,trim and modify as per your wish!  ఇంకో విషయం శిష్యా, పక్క వాడి లోకం నుండి గుడ్డిగా copy paste చెయ్యకు.  అప్పుడు నువ్వు నువ్వుగా ఉండవ్‌,  వాడికి copy అయ్యి చివరకు paste అవుతావ్‌. తెలిసిందా?  కొత్తగా ఉన్నా గమ్మత్తుగ...

కోపాన్ని జయించడం ఎలా?

  నేను ఎన్నో personality development కోర్సులు చేసి  మొత్తానికి కోపాన్ని జయించగలిగానోయ్‌!  మీరు చాలా great Sir!!  Thank you. నన్ను ఎవడైనా తిట్టాడనుకో.  ఒకటి నించీ వంద దాకా అంకెలు లెక్కబెడతా.  Super Sir! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌? తరువాత అటూఇటూ వంద అడుగులు పచార్లు చేస్తా.  ఓహో! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌?  తరువాత రెండు వందలసార్లు ఊపిరి నెమ్మదిగా పీల్చి వదులుతా.  అలాగా! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌? తరువాత నాలుగు రౌండ్లు జపమాల తిప్పుతా.  ఓ! అప్పుడు కోపం పోతుంది కదా సార్‌? తరువాత గంటసేపు శీర్షాసనం వేస్తా.  బావుంది Sir! అప్పుడు కోపం పూర్తిగా పోతుంది కదా సార్‌?  తరువాత నన్ను తిట్టిన వాడి ఇంటికి వెళ్ళి కొట్టేసి వస్తా.  అప్పుడు నా కోపమంతా ఏంటో చేత్తో తీసేసినట్టు మాయం అయిపోతుందోయ్‌!

నమ్మకం vs నమ్మకం

  మా దేవుడే నిజమైన దేవుడు. అలాగని ఎవరు చెప్పారు? మా బాదురీ చెప్పాడు. ఆయనకెలా తెల్సు? ఆయన చూసాడా? ఆయన రోజూ దేవుడితో మాట్లాడతాడు. ఆయన దేవుడితో మాట్లాడ్డం నువ్వు చూసావా? లేదు.  రోజూ దేవుడితో మాట్లాడతానని ఆయన చెబితే మేం నమ్ముతాం. సరే, మీ దేవుడిని నమ్మకపోతే? నరకం! మరి నీ తల్లీ తండ్రీ నమ్మట్లేదుగా. వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకీ నరకమే! అవున్లే, నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళను నరకంలో వెయ్యాల్సిందే! 

హక్కు vs హక్కు

  పానకాలూ, బావున్నావా? నేనిప్పుడు పానకాలు కాదు. “పాన్‌” అని పిలు. అదేంటి? నీ పేరు పానకాల స్వామి కదా? అది ఇది వరకు.  ఇప్పుడు గోడ దూకి అటు వెళ్ళా.  ఓ! సరే,పోనీలే. అది నీ హక్కు! అవునూ, ఈమధ్య మీ నాన్న పోయాడని విన్నా.  అవును. నేనూ విన్నా. కానీ వెళ్ళలేదు.  మా నాయన మాకిప్పుడు బయటి వాడు.  నేను మీ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చెయ్యకూడదు.  తండ్రి పోతే వెళ్ళలేదా!!! ఎవరు చెప్పారయ్యా ఇదంతా నీకు? మా కొత్త మార్గం బాదురీ చెప్పాడు. అసలు ఫాదర్‌ కన్నా ఇతనెక్కువైయ్యాడన్న మాట. ఈమధ్య మీ అక్క కూతురు పెళ్ళైయ్యిందిగా,  నువ్వు మేనమామవు కదా, మరి వెళ్ళావా?  నేను వెళ్ళలేదు.  నేను మీ ఆచారాలు పాటించరాదని మా బాదురీ చెప్పాడు. పూర్తిగా మారిపోయావ్‌, పానకాలూ, సారీ, పాన్‌! వస్తా!  కొన్నాళ్ళయ్యాక ఇద్దరూ మళ్ళీ కలిసారు-  అరే, పాన్‌! బావున్నావా?  ఏంటలా నీరసంగా కనిపిస్తున్నావ్‌?  నేను పాన్‌ గా మారానని మా నాన్న ఆస్తంతా  పక్కనున్న శివాలయానికి రాసేసాడు రా!  ఓ! సరే పోనీలే. అది మీ నాన్న హక్కు!