తాతా,ఊతునా?
క్రౌంచద్వీపంలో తెలుగు ప్రొఫెసర్ గా కొలువు చేస్తున్న తాతాచారి సూటూబూటు వేసుకుని తెలుగు వాళ్ళ తెలుగు సభలో ప్రసంగించడానికి డాబుగా వెళ్ళాడు. అన్నింటికీ ఈలలు,చప్పట్లు కొట్టే సభికుల మందలో, దురదృష్టవశాత్తూ ఓ తెలివైన తెలుగువాడు కూర్చున్నాడు. తాతాచారి: తెలుగు కూతురులాంటిది. ఎవరి కూతురు వాళ్ళకి అందంగా ఉంటుంది. నీ కూతురు బాగోలేదని ఎవరూ అనరుగా. కాబట్టి తెలుగు అందమైన భాష అని మనలో మనం అనుకోవడమే. హిహ్హిహ్హీ.. చప్పట్లు, నవ్వులు. తెలివైన తెలుగువాడు (మనసులో) : అదేమిటీ? భాష తల్లిలాంటిది కదా? కూతురులాంటిది అంటాడేమిటి? తల్లి ఎలా ఉన్నా అందమైనది కాదా? అనుకుని, ఇంకా నయం girl friend లాంటిది, ఎవడి girl friend వాడికి అందంగా కనిపిస్తుంది,అనలేదు. ఏదో తేడాగాడిలా ఉన్నాడే? తాతాచారి: మనలో మనం తెలుగు అందమైనది,గొప్పది అనుకుంటే చాలదు, ఇంగ్లీషు వాళ్ళు, పోనీ ఫ్రెంచివాళ్ళతో నిండి ఉన్న సభలోకి వెళ్ళి ఈమాట అనండి,చూద్దాం? ఎవడైనా ఒప్పుకుంటాడేమో? హిహ్హిహ్హీ.. చప్పట్లు, నవ్వులు. తెలివైన తెలుగువాడు (మనసులో): ఎందుకు చెప్పలేను? ఎక్కడైనా చెప్పగలను. నా భాష గొప్పదని చెప్పుకోవడాన్ని ఎవ్వడైన...