పోస్ట్‌లు

అక్టోబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

బాబాజీ మాయ!

  ఏమిటండీ ఈ దారుణం? చూసారా మీరు?  దేవీ నవరాత్రుల్లో ఆ బాబాజీ విగ్రహానికి విగ్గు,సవరం పెట్టి అమ్మవారిలాగా తయారు చేసి కూచోపెట్టారు! 🙄 పోనీలెండి, బాబాజీలో అమ్మవారిని చూస్తున్నారు. వదిలెయ్యండి.😀 ఏమిటండీ వదిలేసేది? చూస్తూ ఉంటే వెర్రి ముదిరిపోతున్నది.  అయినా ఆ బాబాజీ ఎప్పుడు తన మతం దేవుడినేగా తలచుకున్నది? ఆయన్ను అమ్మవారిని చేసి కూచోబెట్టడం ఏమిటండీ? 😔 భగవంతుడిని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చునని వాళ్ళు అలా ప్రొసీడవుతున్నారు. వదిలెయ్యండి. 😄 అది కాదండీ, హిందూ దేవీ దేవతల్లో ఏ రూపంతోనైనా ఆరాధించమని కదా మనవారు చెప్పింది? వేరే మతం దేవుళ్ళని, వేరే మతం బాబాలను తెచ్చి మనం పూజించడం ఏమిటండీ? 😠 పోనీలెండి, పూజించుకోనివ్వండి. మనకేం నష్టం.😁 పూజించుకోనివ్వడం కాదండీ. ఇప్పుడసలు మామూలు గుళ్ళకి, ప్రాచీన దేవాలయాలకు వెళ్ళడం తగ్గిపోయింది. ఎవరి నోట చూసినా బాబాజీయే. ఆయనే రాముడుట, శివుడుట, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడట. ఇప్పుడు కొత్తగా అమ్మవారిని కూడా చేసారు. ఎక్కడిదాకా పోతోందండీ ఈ వెర్రి? 🤯 కొంచెం ఎక్కువ చేస్తున్నారనుకోండి. ఇది వరకు ఓ సాంప్రదాయానికి చెందిన పరంపరలో గురువుగా చెప్పేవారు. ఇప్పుడు భగవంతుడిని చేసేసారు. చ

ఎర్ర సాంబారులో కరివేపాకులు

  ఇంకా మహాకవి అరుణశ్రీ, హలాహలం,కవి సామ్రాట్టు,ఎర్ర రావి రచనలే చదవడం కుట్ర అంటున్నారు. విన్నావా? విన్నా.  సాహితీ బజారులో వీళ్ళ నాసిరకం సరుకు కాల పరీక్షకు నిలబడదన్న సంగతి గ్రహింపుకు వచ్చి దిగులు పుడుతున్నట్టుంది పాపం. అదీ అసలు భయం. 😀 అది కాదు, ఈ జాబితాలో కవి సామ్రాట్టు ఎందుకొచ్చాడు? మిగతా వాళ్ళ పేర్లు మాత్రమే వ్రాస్తే కవి సామ్రాట్టు టైపు సాంప్రదాయ రచనలు చదవమన్న అర్థం వస్తుందనా?   కావచ్చు. ఆ జాబితాలో ఉన్నవారందరికీ ఒక కామన్‌ పాయింట్ ఉంది చూడు. వారంతా బ్రాహ్మణులు! ఓ! అయితే వారి దృష్టిలో జంధ్యామార్కుల వారన్న మాట. వారి రచనలు చదవొద్దంటున్నారా?  అది సరే, కానీ సామ్రాట్టు తప్ప మిలిగిన వారంతా కరుడు గట్టిన వామపక్షం వారేగా? అంటే వారి తరఫున మాట్లాడిన వారేగా? వారి రచనలు చదవొద్దని ఎలా అంటారు?  ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణ వామపక్షమట!  అదేమిటి? అదంతే. ముందు అగ్రవర్ణం వారిని వారి ఎడమ ఉద్యమాల్లోకి ఆకర్షించి, వారి శక్తిని, తెలివిని ఆ ఉద్యమాలు బలపడడానికి వాడుకుంటారు.  తర్వాత? తరువాత అదే అగ్రవర్ణం అన్న పాయింటును వాళ్ళను విమర్శించడానికి, బయటికి తొయ్యడానికి వాడుకుంటారు! అసలు ఎవరి రచనను చదవడమైనా కుట్ర ఎలా అవుతుంది?

Guide (1965)

  చాలా యేళ్ళ తరువాత Guide సినిమా చూసాను. ఆర్‌.కే. నారాయణ్‌ గారి The guide (1958) నవల ఆధారంగా తీయబడ్డ సినిమా ఇది.  కథ మూడు పాత్రల మధ్య నడుస్తుంది. నృత్యకారిణి, దేవదాసి అయిన రోజీ, ఆమె భర్త మార్కో, కథకి హీరో రాజు. ఈ పాత్రల స్వభావాలు, స్వభావాల్లోని మార్పులు- మానవ మనస్తత్వాలను పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయో చాలా సహజంగా చూపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా రాజులో జరిగే మార్పులు, మామూలు జీవితం నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం, అక్కడనుండి పతనం చెంది చివరకు అనుకోకుండా ఒక సదాశయం కోసం ప్రాణత్యాగం చేయడంతో ముగుస్తుంది. మనిషి జీవితంలోని వివిధ దశలను చూపించడంలో ఈ సినిమా కథ ఒక గొప్ప స్థాయిని అందుకుంది.  కథ హక్కుల కోసం ఆర్‌.కే.నారాయణ్‌ వద్దకు ఖరీదైన కారులో వచ్చారుట దేవానంద్‍. చెక్కు బుక్కు తీసి ఎంత కావాలో వ్రాసి ఇస్తానని దేవానంద్‍ అంటే, సినిమా హిట్టయ్యాక ఇవ్వండని నారాయణ్‌ అన్నారట. ఇంత అద్భుతమైన సినిమా, కథ తన కాలానికన్నా ముందుండడం వల్ల (పేరు వచ్చినా) ఆర్థికంగా విజయం సాధించలేక పోయింది. దాంతో కథ ఇచ్చిన నారాయణ్‌ గారికి ఒక్క పైసా ముట్టలేదుట! ( దేవానంద్‍ తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఈ సినిమా తీసారుట.) ఇది హాలీవుడ్‌

పద్యపాక ప్రవీణ

  మిర్చీలను కూర్చి జారుగ కల్పుము శనగపిండి, మజ్జారే బజ్జీలను వేయించుము సలసల నూనెన్‌! బుజ్జీ, ఆ బజ్జీలను బొజ్జ నిండ  జోరుగ తినిన‌ అవుదువు బజ్జీ!  దారినపోయే దానయ్య: ఇదేం పద్యమండీ? ఏమిటి దీని ఛందస్సు?  ఛందో రావు: ఇది నేను కనిపెట్టిన జయమాలినీ ఛందస్సు. మీకు నచ్చినచో లైకు కొట్టి షేరు చేయుము.  కలిపితి నే శనగపిండి కలిపితి మరి కారముప్పు ఉల్లి ముక్కలతోడన్‌! దించితి నే పకోడీలు వాయల్వాయలు అకటా మరి ఒక్కటైన మిగలదె నాకు, రుచి చూడంగన్‌!  దానయ్య: ఇదేం పద్యమండీ? ఏమిటి దీని ఛందస్సు?  ఛందో రావు: ఇది నేను కనిపెట్టిన సిలుకు స్మిత ఛందస్సు. మీకు నచ్చినచో లైకు కొట్టి షేరు చేయుము.  చిక్కుళ్ళు తినిన ఎక్కిళ్ళు వచ్చును చెక్కిళ్ళు నొవ్వగన్‌ చక్కని కారపుచెక్కలు చేసితినక్కా తినుము నీ పళ్ళు విరుగగన్‌!  దానయ్య: ఇదేం పద్యమండీ? ఏమిటి దీని ఛందస్సు?  ఛందో రావు: ఇది నేను కనిపెట్టిన జ్యోతిలక్ష్మి ఛందస్సు. మీకు నచ్చినచో లైకు కొట్టి షేరు చేయుము.  చుట్టితిని సున్నుండలు చుట్టితి జీలేబీలు చుట్టి న చుట్టే చుట్టితి కారప్పూసల్‌ బెట్టు చేయక సుష్టుగ తినుమా  చిట్టెమ్మా, నా చేతి చిట్టి గట్టి చెగోడీల్‌!   దానయ్య: ఇదేం పద్యమండీ? ఏమిటి దీని