మతిమరుపు చిలక వలకు పడిందోయ్!
గాలిమేడల ఆశాజీవి Illusion City లో Software ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కానీ ఆనందంగా లేడు. పని ఒత్తిడితో పాటు బాస్ ఉన్మత్త రావు పెద్ద ఇత్తడి కావడం చేత రోజూ తత్తిడి బిత్తిడి అవుతున్నాడు. ఉద్యోగం అతని అందమైన వంకీల జుట్టును ఎత్తుకు పోయింది. బట్ట తల అతని పెళ్ళికి గట్టి మట్టి గోడలా అడ్డు నిలిచింది. కనీసం పెళ్ళి చూపుల వరకైనా రప్పిద్దామని జుట్టున్నప్పటి పాత ఫొటోలు పంపి మోసం చేసాడు కొన్నాళ్ళు. ఫలితం లేదు. పదేళ్ళ నాటి పాత ఫొటోలు ఫేక్‌బుక్ లో పెట్టి ఆడపిల్లల్ని attract చేద్దామనుకున్నాడు. కొంత సఫలం అయ్యాడు కూడా. కానీ ఆశాజీవి అసలు స్వరూపం అవగతం కాగానే వాళ్ళంతా అక్కడినుండి పరారయ్యారు. తన ప్రయత్నాలన్నీ చిత్తడి చిత్తడి అవుతున్నాయని ఎంతెంతో విచారించాడు ఆశాజీవి. ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా దుప్పటి కప్పి, జీతం వస్తోంది కనక హాయిగా ఎంజాయ్ చేద్దామని, Illusion City లోని ఓ మెగా బార్‌కి వెళ్ళి మందు పట్టించాడు ఆశాజీవి. అదేం మందో, తాగేటప్పుడూ సుఖం లేదు, తాగిన తర్వాత హాంగోవరు,...