పండుగంటే ఆరాధన
పెద్దాయన: వినాయక చవితి నాడు ఏం చేయాలిరా? ఆకలేష్: ఏముంది పెద్దాయనా! వినాయకుడి పూజేదో చేసేసుకుని, ఉండ్రాళ్ళు, పులిహోర, పరవాన్నం, గారెలు,బూరెలు, నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, పులుసు చేసుకుని తినడమే. లొట్టేష్: బిర్యానీ కూడా. పెద్దాయన: వినాయక చవితి అంటే వినాయకుడిని ఇంటిలో ప్రతిష్టించుకుని ఆరాధించాల్సిన రోజు. ఆ రోజంతా వినాయకుని ధ్యానంలోనే గడపాలి. పిండి వంటలు అవీ చేయడం వినాయకుడికి నైవేద్యం పెట్టడానికే. తెలిసిందా ? మరి, దీపావళి రోజు ఏమి చెయ్యాలిరా? ఆకలేష్: ఏముంది, మిఠాయిలు, పిండి వంటలు, కొత్త బట్టలు,టపాసులు! లొట్టేష్: బిర్యానీ కూడా. పెద్దాయన: దీపావళి అంటే లక్ష్మీ దేవిని ఆరాధించవలసిన రోజు. అది ముఖ్యం. ఇంతకీ మన పండుగలన్నీ ఆయా పండుగలకు సంబంధించిన దేవతల ఆరాధనలో గడుపవలసిన రోజులు. అంతేగానీ కేవలం ఉత్సవాలు కాదు. పండుగ అనగానే హడావిడి చేసేది ఎవర్రా? ఆకలేష్: వ్యాపార సంస్థలు, పెద్దాయనా! “దీపావళీ ధమాకా!” “దీవాలీ సేల్స్!” “ఈ దివాలీ రోజు మా బ్రాండ్ చాక్లెట్లతో నోరు తీపి చేసుకోండి” “ఈ హోలీ జరుపుకోండీ, మా కూల్‌డ్రింక్స్...