భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః
హలో,హలో,డాక్టర్! ఈమధ్య నాలో వయెలెన్స్ ఎక్కువైపోయి కసాక్ కసాక్‌మని ఏసెయ్యాలనిపిస్తోంది. అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్! ఆగండాగండి. నింపాదిగా ఈ కుర్చీలో కూచోండి ముందు. ఉదయం నుండీ మీ దినచర్య ఏమిటో చెప్పండి? పొద్దున్నే న్యూస్ పేపర్లో కసాక్ కసాక్ నేర వార్తలు బ్రౌజ్ చేయడం నా హాబీ డాక్టర్! పొద్దున్నే నేర వార్తలేంటండీ? అవి చదువుతుంటే కిక్కొస్తుంది డాక్టర్! చదివాక మాత్రం బీపీ వస్తోంది. సరే,తర్వాతేంజేస్తారు? తర్వాత టిఫిన్ చేస్తూ కసాక్ కసాక్ నేరాలు,ఘోరాలు టీవీలో చూస్తా డాక్టర్! టిఫీన్ చేస్తూ కూడానా? సరే, తర్వాత? భోం చేసి నిద్ర పోతా. పొద్దున చదివినవి, చూసినవి కసాక్ కసాక్‌లన్నీ కలల్లోకి వస్తాయి డాక్టర్! రావూ మరి? అప్పుడేంజేస్తారు? లేచి బీపీ టాబ్లెట్ వేస్కుంటా డాక్టర్! హుమ్.. బావుంది మీ వరస. మరి సాయంత్రాలేంజేస్తూ ఉంటారు? సాయంకాలం సిన్మాకెళ్తా డాక్టర్! ఓహో, ఎలాంటి సిన్మాలు చూస్తుంటారు? గండ్రగొడ్డలితో అడ్డంగా నరుకుతా, తాట తీసిన మొనగాడు, తుపాకీతో వంద హత్యలు ఇలాంటి కసాక్ కసాక్ సిన్మాలు చూస్తా డాక్టర్! అవెందుకండీ మీకు? అ...